Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ క్రికెట్ కప్ నుంచి పాకిస్థాన్‌ను నిషేధించలేం : ఐసీసీ

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (16:05 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు షాక్ తగిలింది. త్వరలో జరుగనున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను దూరంగా పెట్టలేమని ఐసీసీ తేల్చచెప్పలేదు. పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలతో సంబంధాలు తెంచుకోవాలంటూ పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసిన విషయం తెలిసిందే.
 
దీనిపై ఐసీసీ స్పందిస్తూ, ఇలాంటి విషయాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. అయితే ఇలాంటిది చేసే అవకాశం అస్సలు లేదు. దేశాలపై నిషేధం అన్నది ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేశారు. 
 
దీనిపై ఐసీసీ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినా.. సభ్యులెవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. బోర్డు తరపున ఈ సమావేశానికి సెక్రటరీ అమితాబ్ చౌదరి హాజరయ్యారు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఎంతో మంది విదేశీ ప్లేయర్స్ ఆడుతున్నా.. ఎవరూ ఇలాంటి ఫిర్యాదు చేయలేదు. 
 
భద్రత కీలకమైనదే అయినా దీనిపై పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉన్నాం అని ఐసీసీ అధికారి చెప్పారు. ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 16న పాకిస్థాన్‌తో ఇండియా ఆడనుంది. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆడాలా వద్దా అన్నదానిపై భారత్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments