హైదరాబాద్‌లో సంజూ శాంసన్ విధ్వంసం - రోహిత్ శర్మ రికార్డు బద్ధలు

ఠాగూర్
ఆదివారం, 13 అక్టోబరు 2024 (10:09 IST)
పర్యాటక బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును ఆతిథ్య భారత జట్టు చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు సంజూ శాంసన్ తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా కేవలం 47 బంతుల్లో 111 పరుగుులు చేశాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ అనేక రికార్డులను నెలకొల్పాడు కూడా. 
 
భారత క్రికెట్ జట్టు తరపున టీ20ల్లో సెంచరీ బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. టీ20 ఫార్మాట్లో భారత్ తరపున రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. శాంసన్ కేవలం 40 బంతుల్లో సెంచరీ బాదాడు. అయితే అతడి కంటే ముందు రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లో శతకం నమోదు చేశాడు. సెంచరీ విషయంలో రోహిత్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టలేకపోయినా అర్థ సెంచరీ విషయంలో రికార్డు సాధించారు. 
 
శాంసన్ కేవలం 22 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. టీ20ల్లో బంగ్లాదేశ్‌ ఏ భారత ఆటగాడికైనా ఇదే వేగవంతమైన అర్థ సెంచరీగా నిలిచింది. ఈ విషయంలో రోహిత్ ఆల్ టైమ్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు. 2019లో బంగ్లాదేశ్‌పై అర్థ సెంచరీ నమోదు చేయడానికి రోహిత్ శర్మ 22 కంటే ఎక్కువ బంతులు ఆడాడు.
 
మరోవైపు టీ20 ఫార్మాట్లో సంజూ శాంసన్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. బంగ్లా లెగ్ స్పిన్నర్ రిషాద్ హొస్సేన్ వేసిన ఓ ఓవర్లో ఏకంగా వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. దీంతో ఒక ఓవర్లో వరుసగా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగువ స్థానంలో నిలిచాడు.
 
ఒక ఓవర్లో వరుసగా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు.. 
1. యువరాజ్ సింగ్- వరుసగా 6 సిక్సర్లు.
2. డేవిడ్ మిల్లర్ - వరుసగా 5 సిక్సర్లు. 
3. కీరన్ పొలార్డ్ - వరుసగా 5 సిక్సర్లు. 
4. సంజు శాంసన్ - వరుసగా 5 సిక్సర్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

పవన్‌ను కలిసిన చంద్రబాబు.. బాలయ్య కామెంట్స్‌పై చర్చ జరిగిందా?

అండమాన్ సముద్ర గర్భంలో సహజవాయువు నిక్షేపాలు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

తర్వాతి కథనం
Show comments