Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టంరాజువారికండ్రిగకు వస్తోన్న సచిన్ టెండూల్కర్... ప్రజల సంబరాలు..

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాకు రానున్నారు. దత్తత తీసుకున్న గూడురు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగలో పర్యటించనున్నారు. అనంతరం ఈ ఊరు బాగోగులపై అక్కడి ప్రజలతో చర్చించనున్నారు. మరికొన

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2016 (11:02 IST)
ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెల్లూరు జిల్లాకు రానున్నారు. దత్తత తీసుకున్న గూడురు మండలంలోని పుట్టంరాజువారికండ్రిగలో పర్యటించనున్నారు. అనంతరం ఈ ఊరు బాగోగులపై అక్కడి ప్రజలతో చర్చించనున్నారు. మరికొన్ని విషయలపై కూడా ఆయన ఆరా తీయనున్నారు. సమాచారం తెలుసుకున్న ఆ గ్రామవాసులు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు. తమ ఊరి పరిస్థితిని సచిన్ చక్కబెట్టి ఊరు అభివృద్ధికి కృషి చేస్తారని ఆ గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు.
 
కాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... అభిమానులు క్రికెట్ దేవుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఆ గ్రామ ప్రజలకు నిజంగానే దేవుడిలానే కనిపించాడు. పుట్టంరాజువారి కండ్రిక... నెల్లూరు జిల్లాలోని ఈ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. తమ గ్రామాన్ని సచిన్ దత్తత తీసుకున్నాడు అని తెలియగానే అక్కడి ప్రజలు పండుగ చేసుకున్నారు. 
 
సచిన్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి - కొత్త బట్టలు కొనుక్కుని మరీ సంబరాలు చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్ సూపర్ స్టార్ అంటూ పాటలు పాడుకున్నారు. సచిన్ అడుగుపెట్టిన తమ నేల బంగారం అయిపోతుందనుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత కన్నెత్తి కూడా చూడలేదని విమర్శలు వచ్చాయి. తాజాగా సచిన్ నెల్లూరుకు వస్తున్నారని తెలుసుకున్న పుట్టంరాజువారికండ్రిగ గ్రామస్తులు పండగ చేసుకుంటున్నారు.  

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments