Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కిక్‌బాక్సింగ్ పోటీలు.. భారత్‌కు పసిడి.. జమ్మూకాశ్మీర్ చిట్టితల్లి తజ్ముల్ అదుర్స్

ప్రపంచ కిక్‌బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలిసారిగా స్వర్ణపతకం లభించింది. ఇటలీలోని ఆండ్రియాలో జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిట్టి తల్లి తజ్మ

Webdunia
శనివారం, 12 నవంబరు 2016 (17:10 IST)
ప్రపంచ కిక్‌బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలిసారిగా స్వర్ణపతకం లభించింది. ఇటలీలోని ఆండ్రియాలో జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఎనిమిదేళ్ల చిట్టి తల్లి తజ్ముల్ ఇస్లామ్ పసిడి సాధించింది. భారత్ తరపున ఆడిన తజ్ముల్‌ ఫైనల్ పోరులో యూఎస్‌ఏకి చెందిన తన ప్రత్యర్థిని మట్టికరిపించి విజేతగా నిలిచింది. 
 
ఈ సందర్భంగా తజ్ముల్ కోచ్ ఫజిల్ అలీ దర్ మాట్లాడుతూ.. బందిపొరా జిల్లాలోని సైనిక పాఠశాలలో తజ్ముల్‌ మూడో తరగతి చదువుతోందన్నాడు. ప్రపంచ కిక్ బాక్సింగ్ సబ్ జూనియర్ విభాగంలో తజ్ముల్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించిందని కితాబిచ్చాడు. 
 
అంతేగాకుండా తజ్ముల్ దేశానికి స్వర్ణ పతకాన్ని కూడా సాధించిపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లోనూ తజ్ముల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఇటలీలో 6 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ప్రపంచ కిక్ బాక్సింగ్ పోటీల్లో 90 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

తర్వాతి కథనం
Show comments