Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వదేశంలో ఓడిపోవడం అనేది మింగుడుపడని అంశం.. భారత్ ఓటమిపై సచిన్ కామెంట్స్

ఠాగూర్
సోమవారం, 4 నవంబరు 2024 (11:43 IST)
ఏకంగా ఒక టెస్ట్ సిరీస్‌లో ఓడిపోవడం అనేది ఏమాత్రం మింగుడపడని అంశమని భారత క్రికెట్ జట్టు ఓటమిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. స్వదేశంలో పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఈ మూడు టెస్ట్ మ్యాచ్‌లలో భారత ఆటగాళ్ల ఆటతీరు అత్యంత చెత్తగా ఉంది. దీంతో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ ఓటమిని సగటు భారత క్రికెట్ అభిమానితో పాటు.. మాజీ క్రికెటర్లు సైతం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఈ ఓటమిపై సచిన్ టెండూల్కర్ స్పందించారు. 
 
"స్వదేశంలో 0-3 తేడాతో ఓడిపోవడం అన్నది మింగుడు పడని విషయం. ఈ ఓటమి ఆత్మపరిశీలనకు పిలుపునిస్తోంది. ఈ పరాజయానికి కారణం సన్నద్ధత లోపమా, షాట్ ఎంపిక విఫలమవ్వడమా లేక మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమా?" అని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. 
 
ఇక యువ బ్యాటర్లు శుభమాన్ గిల్, రిషబ్ పంత్‌పై సచిన్ ప్రశంసల జల్లు కురిపించాడు. శుభమాన్ గిల్ తొలి ఇన్నింగ్స్ నిలకడగా ఆడాడని మెచ్చుకున్నాడు. ఇక రిషబ్ పంత్ అయితే రెండు ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడాడని కొనియాడాడు. తన చక్కటి ఫుట్ వర్క్ సవాలుతో కూడిన పిచ్‌లు భిన్నంగా మార్చి చూపించాడని అన్నాడు.
 
'పంత్ సింప్లీ సూపర్బ్' అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. సిరీస్ అంతటా నిలకడగా ఆడిన న్యూజిలాండ్‌కు ఘనత దక్కుతుందని సచిన్ ప్రశంసించాడు. భారత్‌లో 3-0తో టెస్ట్ సిరీస్ గెలవడమంటే చక్కటి ఫలితమని వ్యాఖ్యానించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నాడనీ భర్తను చంపేసిన భార్య!

వైఎస్ జగన్‌ను హత్య చేయడానికి 200 మంది షార్ప్ షూటర్స్??

Chandrababu: ఆటోలో ప్రయాణించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు- వీడియో వైరల్

Kulgam Encounter: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం (video)

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

తర్వాతి కథనం
Show comments