డ్రా చేసుకునే మ్యాచ్‌ను చేజేతులా అప్పగించారు : సచిన్ టెండూల్కర్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (08:18 IST)
ఇంగ్లండ్‌లోని సౌతాంఫ్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో న్యూజిలాండ్ చేతిలో భారత్ చిత్తుగా ఓడిపోయింది. నిజానికి డ్రా కావాల్సిన మ్యాచ్‌ను భారత్ చేజేతులా కోల్పోయింది. ఈ ఓటమిని ప్రతి ఒక్క భారత సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేక పోతున్నాడు. అలాంటి వారిలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఒకరు. 
 
కేవలం పది బంతుల తేడాతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీలక బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా అవుట్ కావడం టీమిండియా అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందని సచిన్ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ క్రీజులో ఎక్కువ సేపు ఉండుంటే ఆట మరోలా ఉండేదని, కనీసం భారత్ డ్రా చేసుకునేందుకు అవకాశాలు ఉండేవని వివరించాడు. 
 
టీమిండియా ఓటమికి పరోక్షంగా ఈ ఇద్దరి వైఫల్యమే కారణమని సచిన్ తెలిపాడు. ఆటకు చివరి రోజున తొలి సెషన్ ఎంతో కీలకమని తాను ముందే చెప్పానని అన్నాడు. కోహ్లీ, పుజారా వెంటవెంటనే అవుట్ కావడంతో జట్టు ఒత్తిడికి గురైందని, ఆపై వరుసగా వికెట్లు కోల్పోయిందని ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో విశ్లేషించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో.. అంత ఆహారం వృధా అవుతుందా...

ముగిసిన నైరుతి రుతుపవన సీజన్ - కరువు ఛాయలు పరిచయం చేసి... చివరకు భారీ వర్షాలతో...

ఇసుక అక్రమ రవాణాపై ఉప్పందించాడనీ కాళ్లు చేతులు విరగ్గొట్టిన వైకాపా మూకలు

పెద్దలు పెళ్లిక ఒప్పుకోలేదని తనువు చాలించిన ప్రేమజంట... ఎక్కడ?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"అర్జున్ రెడ్డి" వల్లే గుర్తింపు - క్రేజ్ వచ్చింది : షాలినీ పాండే

'కాంతార చాప్టర్-1'కు ఆటంకాలు కలిగించొద్దు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ 'ఓజీ' కోసం ఒక్కతాటిపైకి మెగా ఫ్యామిలీ

పైరసీ రాకెట్లపై సీపీ ఆనంద్‌తో సినీ ప్రముఖులు సమావేశం

Rashmika : హారర్‌ కామెడీ యూనివర్స్ చిత్రం థామా అలరిస్తుంది: రష్మిక మందన

తర్వాతి కథనం
Show comments