Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాపం.. మమతా బెనర్జీ గెలిచి ఓడారు... 1736 ఓట్లతో సువేందు అధికారి గెలుపు

Advertiesment
పాపం.. మమతా బెనర్జీ గెలిచి  ఓడారు... 1736 ఓట్లతో సువేందు అధికారి గెలుపు
, ఆదివారం, 2 మే 2021 (20:08 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టకేలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు ఓడిపోయారు. ఎంతో ఉత్కంఠ రేపిన నందిగ్రామ్‌లో ఆమె 1736 ఓట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యం చేతులు మారిన ఈ స్థానంలో చివ‌రికి మ‌మ‌త ఓటమిపాలయ్యారు. 16 రౌండ్లు ముగిసే స‌రికి కేవ‌లం 6 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి.. చివ‌రి రౌండ్‌లో ఓట‌మి చ‌విచూశారు. 
 
ఈ స్థానంపై మొద‌టి నుంచీ ఉత్కంఠ నెల‌కొంది. తొలి ఐదు రౌండ్లూ సువేందు ఆధిక్యంలో నిలిచారు. త‌ర్వాత పుంజుకున్నప్పటికీ.. చివరి రౌండ్‌లో మ‌మ‌తకు ఓటమి తప్పలేదు. ఎన్నో ఏళ్లుగా నందిగ్రామ్ అధికారి కుటుంబానికి పెట్ట‌ని కోట‌గా ఉండటంతో  ఆయన 1736 ఓట్ల తేడాతో గెలుపొందారు. 
 
మ‌మ‌తకు సన్నిహితంగా ఉన్న సువేందు అధికారి ఎన్నిక‌ల ముందు బీజేపీలోకి జంప్ అయ్యారు. అయితే మ‌మ‌త ఆయ‌న‌పైనే పోటీ దిగుతాన‌ని ప‌ట్టుబ‌ట్టి బ‌రిలోకి దిగారు. చివ‌రికి విజ‌యం సాధించారు. 
 
అధికారి కోట‌ను బ‌ద్ధ‌లు కొట్టారు. అటు టీఎంసీ కూడా ఘ‌న విజ‌యం సాధించ‌డంతో బెంగాల్‌కు ముచ్చ‌ట‌గా మూడోసారి మమతా బెనర్జీ ముఖ్య‌మంత్రి కాబోతున్నారు. ఇకపై సువేందు అధికారితో పాటు.. బీజేపీ నేతలకు మమతా బెనర్జీ ముచ్చెమటలు పోయించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు దశాబ్దాల చరిత్రను తిరగరాసిన ఎల్డీఎఫ్