చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై రూ.5 కోట్ల బెట్టింగ్ - భారత్ జట్టే ఫేవరేట్ అంటూ...

ఠాగూర్
ఆదివారం, 9 మార్చి 2025 (11:19 IST)
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భాగంగా, మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ నిర్వహించే ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ మ్యాచ్‌పై భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ బెట్టింగ్ దందాకు సంబంధించి ఐదుగురు కీలక బుకీలను అరెస్టు చేశామని వివరించారు. ఇందులో కొందరికి అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన అండర్ వరల్డ్ గ్రూప్ డి కంపెనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టే ఫేవరేట్ అని, ఈ మ్యాచ్‌పై ఏకంగా రూ.5 వేల కోట్లు బెట్టింగ్ జరిగిందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. 
 
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బెట్టింగ్ దందాలు నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలు ప్రవీణ్ కొచ్చర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు బుకీలను స్వయంగా అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌పైనా బెట్టింగ్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ బెట్టింగ్ దందాను దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారని, ప్రతీ మ్యాచ్‌కు తమకు రూ.40 వేల చొప్పున కమీషన్ అందుతుందని తెలిపారు. రెండేళ్లుగా ఓ ఇంటిని రూ.30 వేలకు అద్దెకు తీసుకుని ప్రత్యేకంగా ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments