Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టుతో ఎన్టీఆర్... నజీర్ ఖాన్ ఇంట్లో సందడి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (15:12 IST)
భారత్‌తో క్రికెట్ సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు హైదరాబాద్ నగరానికి చేరుకుంది. అలాగే, భారత జట్టు కూడా ఇక్కడకు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య బుధవారం జరుగనుంది. దీంతో ఇరు జట్లూ సరదాగా గడిపారు. ఈ క్రమంలో భారత క్రికెటర్లతో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కలిశాడు. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, చాహల్, శార్దూల్ ఠాకూర్‌లు ఉన్నారు. వీరిని కలుసుకున్న ఎన్టీఆర్ సరదాగా ముచ్చటించారు. 
 
హైదరాబాద్ నగరంలో ఖరీదైన కార్‌ కలెక్షన్స్‌తో ప్రసిద్ధిగాంచిన హైదరాబాద్‌ వాసి నజీర్ ఖాన్‌ ఇంట్లో క్రికెటర్లు, ఎన్టీఆర్‌ల మధ్య భేటీ జరిగింది. టీమిండియా ఆటగాళ్లలో పలువురు నజీర్‌కు స్నేహితులు ఉండటంతో వారంతా అతడి ఇంటికి వచ్చారు. క్రికెటర్లతో తమ అభిమాన నటుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోయారు.
 
ముఖ్యంగా, "ఆర్ఆర్ఆర్" చిత్రంలోని 'నాటు-నాటు' పాటకు గోల్డెన్ గ్లోబ్‌ను అందుకోవడంపై సూర్యకుమార్‌ యాదవ్‌ శుభాకాంక్షలు చెప్పాడు. తన సతీమణి దేవిషా శెట్టితో కలిసి ఎన్టీఆర్‌తో దిగిన  ఫొటోను సూర్యకుమార్‌ యాదవ్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. సూర్య పోస్టుకు ఎన్టీఆర్‌ స్పందిస్తూ.. "ధన్యవాదాలు సూర్య.. రేపు (కివీస్‌పై) మ్యాచ్‌లో అదరగొట్టాలి" అంటూ రిప్లై ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments