Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణుడు కాపాడాడు.. బంగ్లాకు 65 మీటర్ల దూరం చెక్ పెట్టింది.. భారత్ విజయం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (22:26 IST)
Rohit sharma
ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భారత్ విజయాన్ని నమోదు చేసుకుంది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ విధానంలో ఐదు పరుగుల తేడాతో నెగ్గి సెమీస్ రేసులో ముందంజ వేసింది టీమిండియా.  
 
అడిలైడ్‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు టీమిండియాను ఓడించినంత పనిచేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించగా, బంగ్లాదేశ్ 6 వికెట్లకు 145 పరుగులే చేసి ఓటమిపాలైంది.
 
ఈ మ్యాచ్‌లో వర్షం పడకముందు 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో ఉన్న బంగ్లాదేశ్... మ్యాచ్ మళ్లీ ప్రారంభమయ్యాక వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ ఊపిరిపీల్చుకుంది. 
 
ఈ విజయంతో గ్రూప్-2లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ప్రస్తుతం రోహిత్ సేన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, ఒక ఓటమితో టాప్‌లో నిలిచింది.
 
బంగ్లా నుంచి బాధితుడిగా లిటన్ దాస్ మారాడు. అంతకు ముందు మెరుపు హాఫ్ సెంచరీతో హీరోగా మారి, టీమిండియా బౌలర్లను చితకబాదిన దాస్.. వర్షానంతరం జీరోగా మిగిలాడు. వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ మరోసారి లిటన్ దాస్ నుంచి అదే అటాకింగ్ ఇన్నింగ్స్‌ని ఆశించింది. కానీ, రెండవ బంతికి, టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. 
 
అలాగే కేఎల్ రాహుల్ అద్భుత ఫీల్డింగ్‌ను ప్రదర్శించాడు. బౌండరీ నుంచి వేగంగా అంటే దాదాపు 65 మీటర్ల దూరం నుంచి బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఈ బంతి నేరుగా స్టంప్‌ని తాకి బెయిల్స్‌ను పడేసింది. ఇదే బంగ్లా విజయాన్ని దూరం చేసింది. 65 మీటర్ల దూరం బంగ్లాను ఓడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

తర్వాతి కథనం
Show comments