వెస్టిండీస్‌తో వన్డే - టీ20 సిరీస్ : భారత జట్టు వివరాలు ఇవే...

Webdunia
గురువారం, 27 జనవరి 2022 (11:26 IST)
వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించేందుకు వస్తుంది. ఈ పర్యటనలో వన్డే సిరీస్‌తో పాటు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు టీమిండియా జట్లను ప్రకటిచింది. వన్డే, టీ20 జట్లను వేర్వేరుగా ప్రకటించింది. 
 
ఇందులో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకోగా, 21 యేళ్ళ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు తొలిసారి టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. గాయం కారణంగా సౌతాఫ్రికా పర్యటన సమయంలో జట్టుకు పూర్తిగా దూరమైన రోహిత్ శర్మకు తిరిగి జట్టులో చోటు కల్పించి, సారథ్య బాధ్యతలను అప్పగించారు. అలాగే, రాజస్థాన్ హిట్టర్ దీపక్ హుడాకు కూడా చోటు కల్పించారు. 
 
మరోవైపు, హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. పేసర్లు బుమ్రా, షమీలు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో జట్టులోకి ఎంపికయ్యారు. కేఎల్ రాహుల్‌కు వన్డే జట్టులోనూ, భువనేశ్వర్‌కు టీ20 జట్టులోనూ బీసీసీఐ సెలెక్టర్లు చోటు కల్పించారు. 
 
వన్డే జట్టు : రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ధావన్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, యువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, కృష్ణ, రవి బిష్ణా.
 
టీ20 జట్టు : రోహిత్, రాహుల్, కిషన్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు మరణదండన

బాలయ్య జోలికి వస్తే చర్మం వలిచేస్తాం : వైకాపాకు టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్

ప్రహ్లాద్ కుమార్ వెల్లెళ్ల అలియాస్ ఐ బొమ్మ ఇమ్మడి రవి క్రిమినల్ స్టోరీ (video)

సౌదీ అరేబియాలో హైదరాబాద్ యాత్రికుల మృతి.. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. ఆదేశాలు జారీ

మక్కా నుండి మదీనాకు.. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీ- 42మంది హైదరాబాద్ యాత్రికుల మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dandora: చావు పుట్టుక‌ల భావోద్వేగాన్ని తెలియ‌జేసే దండోరా టీజ‌ర్‌

IFFI: నందమూరి బాలకృష్ణని సన్మానించనున్న 56 ఐ ఎఫ్ ఎఫ్ ఐ

వేలాది మంది కష్టార్జితాన్ని ఒక్కడే దోచుకున్నాడు - కఠినంగా శిక్షించాలి : చిరంజీవి

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

తర్వాతి కథనం
Show comments