Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషబ్ పంత్‌పై ఫైర్ అయిన రోహిత్.. అసలేం జరిగింది?

Webdunia
శనివారం, 20 నవంబరు 2021 (11:00 IST)
కివీస్‌తో జరుగుతున్న రెండో ట్వంటీ20లో ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 రన్స్ చేసింది. ఈ మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్(31), డారిల్ మిచెల్(31), గ్లేన్ ఫిలిప్స్(34) పర్వాలేదనిపించారు. 
 
ఓపెనర్ల ధాటైన ఇన్నింగ్స్‌తో ఓ దశలో 190+ రన్స్ చేస్తుందనుకున్న న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ముఖ్యంగా హర్షల్ పటేల్, స్పిన్నర్లు అదరగొట్టారు. బౌలింగ్‌కు ప్రతీకూలంగా మారిన వికెట్‌పై దుమ్మురేపారు. 
 
హర్షల్ పటేల్ అయితే తన ఐపీఎల్ మ్యాజిక్‌ను అరంగేట్రం మ్యాచ్‌లోనూ రిపీట్ చేశాడు. అయితే వికెట్ల వెనుక అలసత్వంగా ఉన్న రిషబ్ పంత్‌ను హిట్‌మ్యాన్ మందలించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్బంగా భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్ ఆఖరి బంతిని జిమ్మీ నీషమ్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌పై వచ్చి బాల్.. నీషమ్ బ్యాట్‌ను ముద్దాడుతూ కీపర్ పంత్ చేతిలో పడింది. అయితే క్యాచ్ అందుకున్న పంత్ అప్పీల్ చేయకుండా సైలెంట్‌గా చేయికి పైకెత్తుతూ ఔటని సైగ చేశాడు. భువీ అప్పీల్ చేయగా... అంపైర్ స్పందించలేదు.
 
కానీ నీషమ్ మాత్రం అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించకముందే పెవిలియన్ బాట పట్టాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రోహిత్ శర్మ నోరు లేదా? అప్పీల్ ఎందుకు చేయలేదని మందలించినట్లు టీవీ కెమెరాల్లో కనిపించింది.  కామెంటేర్లు సైతం.. పంత్‌పై రోహిత్ సీరియస్ అవుతున్నాడంటూ చెప్పుకొచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

తర్వాతి కథనం
Show comments