Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్‌లో రోహిత్ శర్మ విశ్వరూపం

భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోర్ వేదికగా తన విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీలంకతో శుక్రవారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (08:52 IST)
భారత క్రికెట్ జట్టు స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోర్ వేదికగా తన విశ్వరూపం ప్రదర్శించాడు. శ్రీలంకతో శుక్రవారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఫలితంగా కేవరం 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. తన ఊచకోతతో టి20ల్లో వేగవంతమైన సెంచరీని సమం చేశాడు. వన్డే సిరీస్‌ తొలి మ్యాచ్‌లో విఫలమై రెండో మ్యాచ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన హిట్‌మ్యాన్‌… దానిని టి20 సిరీస్‌లోనూ రిపీట్ చేశాడు. కటక్‌లో రాణించలేకపోయినప్పటికీ ఇండోర్‌లో విశ్వరూపం చూపాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
 
టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేశాడు రోహిత్‌ శర్మ. 35 బంతుల్లో సెంచరీ చేరుకున్న అతడు.. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ పేరిటున్న రికార్డు (2017లో బంగ్లాదేశ్‌పై)ను సమం చేశాడు. 23 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రోహిత్‌.. మరో 12 బంతుల్లోనే సెంచరీకి దూసుకెళ్లాడు. సెంచరీ చేరుకునే క్రమంలో అతడు 11 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో మొత్తం 12 ఫోర్లు, 10 సిక్సర్లున్నాయి. ఫోర్లు, సిక్సర్ల ద్వారానే అతడు 108 పరుగులు చేయడం విశేషం. అతడి పరుగుల్లో ఇవి 91.52 శాతం. ఇదీ రికార్డే. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments