పెళ్ళి రోజున భార్యను ఏడిపించిన రోహి(త్)ట్ శర్మ (వీడియో)
మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీమిండియా కెప్టెన్ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు.
మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టాండింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీమిండియా కెప్టెన్ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా? అనే రీతిలో రోహిత్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ డబుల్ సెంచరీ కొట్టాడు. 151 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 12 సిక్సర్లు, 13 ఫోర్ల సాయంతో ద్విశతకం (201) సాధించాడు.
ఈ క్రమంలో వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ అవతరించాడు. అయితే, రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసిన క్షణంలో అతని భార్య రితిక తీవ్ర ఉద్వేగానికి లోనైంది. స్టేడియంలో ఉన్న ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. కాగా, రోహిత్ శర్మ - రితికలు తమ రెండో పెళ్ళి రోజు వార్షికోత్సవం కూడా బుధవారం కావడం గమనార్హం.
ఇదిలావుండగా, వన్డే క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు మొత్తం 7 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో మూడు రోహిత్ శర్మనే బాదాడు. నిజానికి వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ ఘనత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిటే ఉంది. సచిన్ సౌతాఫ్రికాపై సరిగ్గా 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరూ కాకుండా సెహ్వాగ్ (219), క్రిస్ గేల్ (215), మార్టిన్ గప్టిల్ (237) వన్డేల్లో డబుల్ సెంచరీలు చేశారు. వీళ్లంతా ఓపెనర్లే కావడం ఇక్కడ మరో విశేషం. రోహిత్ తొలి డబుల్ సెంచరీని వెస్టిండీస్‌పై సాధించాడు. ఈ మ్యాచ్‌లో 158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 209 పరుగులు చేశాడు.
ఆ తర్వాత శ్రీలంకపై 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 రన్స్ చేశాడు. ఇప్పటికే వన్డేల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. భారీ సెంచరీలకు కేరాఫ్ అయిన రోహిత్.. సెంచరీ చేశాడంటే స్పీడు పెంచుతాడన్న పేరుంది. ఇవాళ శ్రీలంకతోనూ సెంచరీకి 115 బంతులు తీసుకున్న రోహిత్.. తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 36 బంతుల్లో సెంచరీ కొట్టాడు.