Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ ద్రవిడ్‌కి బీసీసీఐ నోటీసులు.... ఎందుకు?

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (13:21 IST)
జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. బోర్డు అంబుడ్స్‌మన్-ఎథిక్స్‌ ఆఫీసర్‌ రిటైర్డ్‌ జస్టిస్‌ డి.కె.జైన్‌ మంగళవారం ఈ నోటీసు జారీ చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల విషయమై ఈ నోటీసులు జారీ చేయడం గమనార్హం. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని బీసీసీఐ నోటీసులో పేర్కొంది.
 
ద్రవిడ్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (బెంగళూరు) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌ గ్రూప్‌కు ఉపాధ్యక్షుడిగానూ పనిచేస్తున్నాడు. ఈ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఫ్రాంచైజీ ఉంది. 

ఈ నేపథ్యంలో ద్రవిడ్‌ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించాల్సిందిగా ఎథిక్స్‌ ఆఫీసర్‌ నుంచి ద్రవిడ్‌కు నోటీసు జారీ అయింది.
 
గతంలో క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులైన దిగ్గజాలు సచిన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌లపై కూడా గుప్తా ఫిర్యాదు చేశారు. తదనంతర పరిణామాలతో ఈ దిగ్గజాలు సీఏసీ నుంచి వైదొలగడంతో కొత్తగా సీఏసీకి విఖ్యాత మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి, అన్షుమన్‌ గైక్వాడ్‌లను నియమించారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments