ధోనీపై సెహ్వాగ్ కామెంట్స్.. రహానేను పక్కాగా దించాడు..

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (11:35 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రహానే అద్భుతంగా ఆడాడు. ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఎంపికైన రహానే అద్భుతంగా ఆడుతుండగా, ధోనీ గురించి సెహ్వాగ్ షేర్ చేసిన కామెంట్స్ షాక్‌కి గురి చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ప్రారంభమై కోలాహలంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడి 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 
 
గత శనివారం చెన్నై, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మ్యాచ్‌లో అజింక్య రహానె మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగారు. అయితే ఇప్పటి వరకు రహానే బ్యాటింగ్ అంతగా రాణించకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఇది షాక్ ఇచ్చింది. 
 
కానీ ముంబైలో పెరిగిన రహానెకు వాంఖడే మైదానం కలిసొచ్చింది. ఈ స్టేడియంలో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రహానే 3 సిక్సర్లు, 7 ఫోర్లతో ఔట్ కాకుండానే 61 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
 
రహానె సత్తాను అర్థం చేసుకున్న ధోనీ సరైన సమయంలో మైదానంలోకి దింపడంతో రహానెపై ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంలో మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చెప్పిన ఘటన షాక్‌కు గురి చేసింది. మాజీ క్రికెటర్ సెహ్వాగ్ మాట్లాడుతూ.. రహానే నెమ్మదిగా ఆడతాడు. స్ట్రైక్ రొటేట్ చేయలేడని ధోని వన్డేలకు దూరంగా ఉంచాడు. కానీ ఇప్పుడు చెన్నై జట్టుకు అనుభవం అవసరం కాబట్టి ధోనీ రహానెను జట్టులోకి తీసుకున్నాడు' అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

తర్వాతి కథనం
Show comments