టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. లోయర్ ఆర్డర్‌లో దిగి అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకోవడం మహీకి మాత్రమే సాధ్యమన్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టిన ధోనీ.. ఐపీఎల్‌లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ధోనీ పెర్ఫామెన్స్‌పై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన సెహ్వాగ్.. ఈ ఫీట్ ధోని ఒక్కడికే సాధ్యమన్నాడు.
ధోనీ గొప్ప ఆటగాడని సెహ్వాగ్ కొనియాడాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఇక ధోనీ ఆడింది మూడు బంతులే అయినా.. తనదైన మార్క్ చూపించాడు.
ధోనీ బ్యాటింగ్ చేసే సమయంలో జియో సినిమా వ్యూస్ సంఖ్య కోటీ 80 లక్షలకు చేరింది. ఇంకా ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా ధోనీ తన రికార్డును పదిలం చేసుకున్నాడు. ఇలాంటి ఫీట్స్ ధోనీ వల్లే సాధ్యమన్నాడు సెహ్వాగ్