మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్ధలు కొట్టిన కివీస్ ఆటగాడు...

Webdunia
శనివారం, 4 నవంబరు 2023 (16:58 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ ఆటగాడు భారత సంతతికి చెందిన రచిన్ రవీంద్ర మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బద్ధలు కొట్టారు. ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 25 యేళ్ల వయసు లోపల ప్రపంచ కప్‌లో రచిన్ రవీంద్ర మూడు సెంచరీలు చేయగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మాత్రం రెండు సెంచరీలు మాత్రమే చేశాడు. అలాగే ఒకే ప్రపంచ కప్‌లో మూడు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రచిన్ మరో ఘనతను కూడా దక్కించుకున్నాడు. 
 
భారత్‌లో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో తన పేరును బంగారు అక్షరాలతో లిఖించుకున్నాడు. 48 యేళ్ళ ప్రపంచ కప్ చరిత్రలో 25 యేళ్ళ వయసులోపు అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును అధికమించాడు. సచిన్ తన 25 యేళ్ల వయసులోపు ప్రపంచ కప్ పోటీల్లో రెండు సెంచరీలు చేశాడు. 
 
అపుడు సచిన్ వయసు 23 యేళ్ల 351 రోజులు. ఇక కివీస్ ఆటగాడు రచిన్ రవీంద్ర విషయానికి వస్తే తాను ఆడుతున్న తొలి ప్రపంచ కప్‌లోనే ఏకంగా మూడు సెంచరీలు, రెండు అర్థసెంచరీలు బాదేశాడు. ఇపుడు అతని వయసు 22 యేళ్ల 313 రోజులు మాత్రమే. మరోవైపు, ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో మూడు సెంచరీలు చేసిన కివీస్ ఆటగాడిగా కూడా రచిన్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments