Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూణె థర్డ్ వన్డే మ్యాచ్: 329 రన్స్‌కు భారత్ ఆలౌట్

Webdunia
ఆదివారం, 28 మార్చి 2021 (17:56 IST)
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఫలితం తేల్చే చివరి వన్డేలో ఆదివారం పూణెలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 329 పరుగులు చేసింది. 48.2 ఓవర్లకే వికెట్లన్నీ కోల్పోయింది. 
 
ఓ దశలో టీమిండియా దూకుడు చూస్తే 400 పరుగుల స్కోరు సాధ్యమేనని అనిపించింది. కానీ, కీలక సమయాల్లో వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్లు ఆతిథ్య జట్టు జోరుకు బ్రేకులు వేశారు.
 
ఓపెనర్ శిఖర్ ధావన్ 56 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 67 రన్స్ చేయగా, రోహిత్ శర్మ 37 బంతుల్లో 37 రన్స్ చేసి తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. 
 
ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ (7), కేఎల్ రాహుల్ (7) విఫలమైనా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్య జోడీ క్రీజులో ఉన్నంత సేపు విధ్వంసం సృష్టించింది. పంత్ 62 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 78 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్య 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు సాధించాడు.
 
ఆ తర్వాత కృనాల్ పాండ్య (25), శార్దూల్ ఠాకూర్ (21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 30 రన్స్) పోరాడడంతో భారత్ స్కోరు 300 మార్కు దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 3, అదిల్ రషీద్ 2, శామ్ కరన్ 1, రీస్ టాప్లే 1, మొయిన్ అలీ 1, లివింగ్ స్టన్ 1 వికెట్ తీశారు. 
 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే 330 పరుగులు చేయాల్సివుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తో వన్డే సిరీస్‌తో స్వదేశానికి తిరిగివెళ్లనుంది. ఇప్పటివరకు జరిగిన టెస్ట్ సిరీస్, ట్వంటీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ ఓడిపోయిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

Nag; రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ హీరోనేకాదు విలన్ కూడా చేయాలి : నాగార్జున

రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ నుంచి మాళవిక మోహనన్ పోస్టర్ రిలీజ్

మెల్లకన్ను యువకుడు ప్రేమలో పడితే ఎలా వుంటుందనే కాన్సెప్ట్ తో శ్రీ చిదంబరం చిత్రం

తర్వాతి కథనం
Show comments