గబ్బా స్టేడియంలో లవ్ ప్రపోజల్.. వారిపై తిరిగిన కెమెరాలు! (video)

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (18:45 IST)
gabha
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. మూడో రోజైన శుక్రవారం ఇంగ్లండ్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియా గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతోంది.
 
వివరాల్లోకి వెళితే మైఖేల్ అనే యువకుడు మోకాళ్లపై కూర్చుని టోరీ అనే యువతిని పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆమె క్షణకాలం పాటు నమ్మలేకపోయింది. ఆ వెంటనే తేరుకుని ఓకే చెప్పడంతో అతడి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. 
 
ఆ తర్వాత తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆమె చేతికి తొడిగాడు. వారి చుట్టూ ఉన్న అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహ పరచడంతో స్టాండ్స్ కేరింతలతో దద్దరిల్లింది.
 
అలా మ్యాచ్‌ను చిత్రీకరిస్తున్న కెమెరాలు ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. స్టాండ్స్‌లోని అభిమానులు కూడా వారిని మరింత ఉత్సాహపరిచారు. కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇక్కడ ఇంకో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. యాషెస్ సందర్భంగా గబ్బాలో ఇలాంటి ప్రపోజల్ రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ ఓ జంట ఇలానే ప్రపోజ్ చేసుకుని తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించారు.


సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

తర్వాతి కథనం
Show comments