Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వండర్‌ కిడ్'’ పృథ్వీ షా ... రికార్డుల బాద్‌ 'షా'

అతని పేరు పృథ్వీ షా. వయసు 18 యేళ్ల 329 రోజులు. ఆడుతోంది తొలి టెస్టు. అయితేనేం.. తాను బరిలోకి దిగితే అది ఏస్థాయి క్రికెటైనా ఒకటే.. అన్నట్టుగా వండర్‌ కిడ్ పృథ్వీ షా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా అరంగేట్రం చ

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (12:38 IST)
అతని పేరు పృథ్వీ షా. వయసు 18 యేళ్ల 329 రోజులు. ఆడుతోంది తొలి టెస్టు. అయితేనేం.. తాను బరిలోకి దిగితే అది ఏస్థాయి క్రికెటైనా ఒకటే.. అన్నట్టుగా వండర్‌ కిడ్ పృథ్వీ షా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా అరంగేట్రం చేశాడు.

ఇప్పటిదాకా స్కూల్‌ క్రికెట్‌ కావచ్చు.. దేశవాళీలు కావచ్చు.. తాను బ్యాట్‌ పడితే రికార్డుల మోతే అన్నట్టుగా సాగిన అతడి ఆటతీరు సీనియర్‌ జట్టులోనూ కనిపించింది. 
 
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో పృథ్వీ షా అరంగేట్రం చేసి.. కేవలం 99 బంతుల్లో సెంచరీ బాదాడు. 
 
ఫలితంగా అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ టెస్ట్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా నమోదు చేసిన రికార్డులను పరిశీలిస్తే, 
 
* రంజీ, దులీప్‌ ట్రోఫీలతో పాటు టెస్టు అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా పృథ్వీ షా. 
* భారత్‌ తరపున అరంగేట్ర టెస్టులోనే శతకం బాదిన అత్యంత పిన్నవయస్కుడి (18 ఏళ్ల 329 రోజులు)గా షా. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో క్రికెటర్‌. అయితే భారత్‌ నుంచి మొత్తంగా చిన్న వయస్సు (17)లో సెంచరీ సచిన్‌ పేరిట ఉంది. 
* అరంగేట్రంలో అత్యంత వేగంగా (99 బంతుల్లో) శతకం బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా పృథ్వీ షా. ఈ బుడతడు కంటే ధవన్‌ (85), డ్వేన్‌ స్మిత్‌ (93) ముందున్నారు.
* ఫస్ట్‌క్లాస్‌, టెస్టు అరంగేట్రంలో సెంచరీ చేసిన మూడో ఆటగాడు పృథ్వీ షా. గతంలో గుండప్ప విశ్వనాథ్‌, డిర్క్‌ వెల్హామ్‌ (ఆసీస్‌) ఉన్నారు.
* 18 అంతకన్నా తక్కువ వయస్సు ఆటగాళ్లు అరంగేట్రంలో సాధించిన మూడో అత్యధిక స్కోరు (134) షాదే.
* విండీస్‌పై రెండో వికెట్‌కు మూడో అత్యధిక భాగస్వామ్యం (206) నమోదు చేసిన పృథ్వీ షా, పుజారా.
* భారత్‌ నుంచి తొలి టెస్టులోనే శతకం బాదిన 15వ ఆటగాడిగా షా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

తర్వాతి కథనం
Show comments