Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యాయం ప్రతి ఒక్కరికీ అందాలి.. సంతృప్తితో వైదొలగుతున్నా: దీపక్ మిశ్రా

దేశంలో న్యాయం ప్రతి పౌరుడుకీ అందాలని భారత ప్రధాన న్యాయూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన దీపక్ మిశ్రా మంగళవారం

న్యాయం ప్రతి ఒక్కరికీ అందాలి.. సంతృప్తితో వైదొలగుతున్నా: దీపక్ మిశ్రా
, సోమవారం, 1 అక్టోబరు 2018 (19:42 IST)
దేశంలో న్యాయం ప్రతి పౌరుడుకీ అందాలని భారత ప్రధాన న్యాయూర్తిగా బాధ్యతల నుంచి తప్పుకున్న జస్టిస్ దీపక్ మిశ్రా అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన దీపక్ మిశ్రా మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు.
 
దీన్ని పురస్కరించుకుని సోమవారం ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఇందులో దీపక్ మిశ్రా స్పందిస్తూ, భారత న్యాయవ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైనదని, న్యాయశాస్త్రాన్ని మరింత సుసంపన్నం చేసే యువ లాయర్లు మనకు తరగని ఆస్తి అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఎన్నో కేసులను ఎంతో సమర్ధవంతంగా పరిష్కరించిన బలమైన న్యాయవ్యవస్థ మనదని ఆయన కొనియాడారు. న్యాయమనేది ప్రతి ఒక్కరికి అందాలని ఆయన అభిలషించారు. 'చరిత్ర ఒకసారి చాలా దయగా, మరోసారి నిర్దయగా కనిపిస్తుంది. నేను ప్రజల చరిత్రను బట్టి కాకుండా వారి కార్యకలాపాలు, దృష్టికోణం ఆధారణంగానే చూస్తాను' అని వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, ఒక న్యాయమూర్తిగా తన కెరీర్‌లో ఎప్పుడూ మహిళా సమానత్వానికి దూరం కాలేదన్నారు. అలాగే, నా ఎదుగుదల ప్రతి స్థాయిలోనూ బార్ అసోసియేషన్ పాత్ర ఉందనీ, అందుకే బార్‌కు రుణపడి ఉంటాను. ఎంతో తృప్తిగా బాధ్యతల నుంచి వైదొలగుతున్నాను' అని దీపక్ మిశ్రా వ్యాఖ్యానించారు.  
 
కాగా, దీపక్ మిశ్రా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అనేక కీలక కేసులపై సంచలన తీర్పులను వెలువరించారు. ఈయన ఇచ్చిన తీర్పుల్లో గే వివాహాలు, ఆధార్ చట్టబద్ధత, వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించి ఐపీసీ 497 కొట్టివేత, శబరిమలై ఆలయంలో మహిళలకు ప్రవేశం వంటివి ఉన్నాయి. ఇదిలావుండగా, దీపక్ మిశ్రా స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంజన్ గగోయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కస్టమర్ ఐడెంటిటీ కోసం ఆధార్ వద్దు.. డీ లింక్ చేయండి...