లడఖ్‌‌ క్రికెటర్లు జమ్మూకాశ్మీర్‌ జట్టుకు ఆడొచ్చు: రాయ్‌‌

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (13:25 IST)
కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) లడఖ్‌‌కు చెందిన ఆటగాళ్లకు దేశవాళీ క్రికెట్‌‌ ఆడే అవకాశం కల్పిస్తామని బీసీసీఐ కమిటీ ఆఫ్‌‌ అడ్మినిస్ట్రేటర్స్‌‌ (సీఓఏ) హెడ్‌‌ వినోద్‌‌ రాయ్‌‌ తెలిపారు. లడఖ్‌‌ ప్లేయర్లు..  జమ్మూ కాశ్మీర్‌‌ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. ‘కొత్తగా ఏర్పాటైన లడఖ్‌‌ యూటీకి సపరేట్‌‌ క్రికెట్‌‌ బాడీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రస్తుతానికైతే లేదని స్పష్టం చేశారు.
 
ఈ ప్రాంతానికి చెందిన ప్లేయర్లు గతంలో మాదిరిగా బీసీసీఐ కాంపిటిషన్లలో జమ్మూ కాశ్మీర్‌‌కు ప్రాతినిథ్యం వహించొచ్చని తెలిపారు. మరో యూటీ పుదుచ్చేరి మాదిరిగా లడఖ్‌‌ను కూడా బీసీసీఐ ఓటింగ్‌‌ మెంబర్‌‌ను చేసే విషయం గురించి కూడా ఇప్పుడు చర్చలు జరపడం లేదన్నారు. 
 
జమ్మూ కాశ్మీర్‌‌లో ప్రస్తుత పరిస్థితి గురించి బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేయడం లేదని, త్వరలోనే అంతా సర్ధుకుంటుందన్నారు. గతేడాది మాదిరిగా జమ్మూ కాశ్మీర్‌‌ తన హోమ్‌‌ మ్యాచ్‌‌లను శ్రీనగర్‌‌లో ఆడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

తర్వాతి కథనం
Show comments