Webdunia - Bharat's app for daily news and videos

Install App

డియోల్‌ అద్భుతమైన క్యాచ్‌.. ఫిదా అయిన ప్రధాని మోదీ

Webdunia
సోమవారం, 12 జులై 2021 (17:26 IST)
Harleen Deol
ఇంగ్లాండ్‌లో పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో భారత యువ మహిళా క్రికెటర్‌ హర్లీన్‌ డియోల్‌ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్న సంగతి తెల్సిందే. హర్లీన్‌ క్యాచ్‌ను చూసిన మాజీ క్రికెటర్లు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, అభిమానులు ఆమెను అభినందించారు. 
 
తాజాగా భారత ప్రధాని మోదీ కూడా హర్లీన్‌ క్యాచ్‌కు ఫిదా అయ్యారు. హర్లీన్‌ డియోల్‌ను అందుకున్న క్యాచ్‌ అద్భుతమని మోదీ ప్రశంసించారు. హర్లీన్‌ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను మోదీ ఇన్‌స్టా రీల్స్‌లో పోస్ట్‌ చేసి.. అసాధారణం అని క్యాప్షన్ ఇచ్చారు.
 
తొలి టీ20లో భాగంగా ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌లో శిఖా పాండే వేసిన 19 ఓవర్ ఐదో బంతిని అమీ జోన్స్‌ లాంగ్ ఆఫ్ మీదుగా ఆడింది. అయితే బంతి సిక్స్ పోయిందనుకున్న సమయంలో.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్‌ డియోల్‌ ఎడమవైపు గాల్లోకి డైవ్‌ చేసి బంతిని అందుకొంది. 
 
ఇక బాడీ బ్యాలన్స్ ఔట్ కావడంతో బౌండరీ అవతలకి దూకుతూ బంతిని గాల్లోకి విసిరింది. వెంటనే రెప్పపాటు క్షణంలో మళ్ళీ మైదానంలోకి డైవ్‌ దూకి సురక్షితంగా బంతిని ఓడిసిపట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ ఇంగ్లాండ్‌ విజయం సాధించగా… రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక జులై 14న జరగనున్న టీ20 మ్యాచ్ లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తర్వాతి కథనం
Show comments