Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు రాకపోతే.. మేమూ రాము.. బీసీసీఐకి పీసీబీ బెదిరింపు (video)

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (11:32 IST)
ముంబై పేలుళ్ల అనంతరం భారత్- పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయి. ఇండో-పాక్ సరిహద్దు వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ప్రపంచ దేశాలు జడుసుకుంటున్నాయి. ఇలా పాకిస్థాన్ గడ్డపై టీమిండియా అడుగుపెట్టి 15 ఏళ్లయింది. 
 
చివరిసారిగా భారత్ 2005-06 సీజన్‌లో పాకిస్థాన్‌లో పలు మ్యాచ్‌లు ఆడింది. ఉగ్రవాదం కారణంగా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం బెదిరింపులకు దిగింది. ఈ సెప్టెంబరులో తమ గడ్డపై జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత జట్టు రావాల్సిందేనని, లేకపోతే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ కు తమ జట్టు రాదని హెచ్చరించింది. 
 
ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ వెల్లడించారు. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనకపోతే తాము టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. మరి ఈ బెదిరింపులను బీసీసీఐ ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి. 
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments