Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య వద్దకు ఆ ఇద్దరు క్రికెటర్లను రానివ్వను : భజ్జీ

Webdunia
ఆదివారం, 13 జనవరి 2019 (12:56 IST)
ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు క్రికెటర్లను తన భార్య వద్దకు రానివ్వరని చెప్పారు. 
 
కాగా, ఇద్దరు క్రికెటర్లు చేసిన వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో వారిపై బీసీసీఐ కూడా నిషేధం వేటు వేసింది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, 'నా పక్కన నా భార్య, కుమార్తె ఉంటే, వీరిద్దరితో నేను ప్రయాణించను. వీరు కేవలం ఒకే కోణంలో మహిళలను చూస్తారంటే, ఏమనుకోవాలి? వారి తీరు సరికాదు' అని వ్యాఖ్యానించారు. 
 
వారి వ్యాఖ్యలు క్రికెటర్లందరికీ వర్తింప చేయవద్దని అంటూనే, వారి మాటలు మొత్తం క్రికెట్ పరువు తీశాయని భజ్జీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు టీవీ షోలు చూస్తున్న వారంతా, హర్భజన్ కూడా ఇలాగే ఉంటాడేమో? గతంలో లక్షణ్, సచిన్ కూడా ఇలాగేనేమో? అని అనుకుంటున్నారని హర్భజన్ వ్యాఖ్యానించాడు. 
 
కాగా, కాఫీ విత్ కరణ్‌ అనే టీవీ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్, పాండ్యాలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, తమ కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సస్పెండై, ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమై, ఇంటికి తిరిగొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

వైజాగ్: ప్రియుడు తనను కాదని మరో పెళ్లి చేసుకున్నాడని బైకుని తగలబెట్టిన ప్రియురాలు

వివాహితతో సహజీవనం, ఆమె కొడుకు చేతిలో హత్యకు గురైన వ్యక్తి, కారణం ఇదే

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments