Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో పెట్టుకుంటే అంతేమరి.. పీసీబీకి రూ.కోట్ల నష్టం.. ఎలా? (video)

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (12:57 IST)
భారత్‌తో పెట్టుకున్నందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భారీ మూల్యమే చెల్లించుకుంది. భారత గడ్డపై ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లుఆడేందుకు నిరాకరించినందుకు పీసీబీ ఇపుడు ఏకంగా రూ.691 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. 
 
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొనివున్న విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. దాయాది దేశాలైనప్పటికీ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదు. పైగా, ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ టోర్నీ మ్యాచ్‌ల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. 
 
అదేసమయంలో 2008 నుంచి ద్వైపాక్షిక సిరిస్‌లను పాకిస్థాన్‌ రద్దు చేసుకుంది. పాకిస్థాన్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు చివరి ఐదేళ్ల ఒప్పందం గడువు ఈనెలతో ముగియనుంది. ఈలోగా రెండు ద్వైపాక్షిక సిరిస్‌లు ఆడాల్సి ఉంది. 
 
కానీ పాకిస్థాన్‌ వచ్చి తమ దేశ ఆటగాళ్లు ఆడరని బీసీసీఐ తేల్చిచెప్పడంతో టెన్ స్పోర్ట్స్, పిటివి మీడియా కుదుర్చుకున్న 149 మిలియన్ డాలర్ల ఒప్పందంలో రావాల్సిన 90 మిలియన్ డాలర్ల (రూ.691 కోట్లు)ను ఆదేశం నష్టపోయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

తిరువణ్ణామలైలో విరిగిపడుతున్న కొండచరియలు.. ఏడుగురు ఏమయ్యారు.. వెయ్యి అడుగుల? (videos)

ట్రైనింగ్ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరేందుకు వెళుతున్న ఐపీఎస్.. అంతలోనే మృత్యుఒడిలోకి...

కులాంతర వివాహం చేసుకుందనీ అక్కను కడతేర్చిన సోదరుడు...

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

తర్వాతి కథనం
Show comments