ఐసీసీ ట్వంటీ20 మ్యాచ్: విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్... నిజమా?

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (12:21 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‍‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. చేతుల్లో బంతి లేకపోయినప్పటికీ కోహ్లీ థ్రో చేశారు. దీనిపై బంగ్లాదేశ్ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫీల్డింగ్ అంటూ నూరుల్ హాసన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు అడ్డుపడటంతో బంగ్లాదేశ్ జట్టు విజయాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. ఏడో ఓవర్‌లో షాట్ రూపంలో తన వైపు బంతి రాగా దాన్ని అర్షదీవ్ సింగ్ పట్టుకుని వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వైపు విసిరాడు. సరిగ్గా వీరి మధఅయలో ఉన్న విరాట్ కోహ్లీ కూడా అర్షదీప్ విసిరిన బంతిని తాను పట్టుకుని విసిరేసినట్టుగా చేతులను థ్రో చేశాడు. దీంతో బంగ్లాదేశ్ వికెట్ కీపర్, బ్యాటర్ అయిన నూరూల్ హాసాన్ తప్పు బట్టాడు. 
 
"మైదానం తడిగా ఉంది. కనుక దీని ప్రభావం ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీన్ని చూశారు. బాల్ చేతుల్లో లేకపోయినా నకిలీ థ్రో చేసినదుకు ఐదు పరుగుల పెనాల్టీ విధించాలన్నది నా ఉద్దేశ్యం" అని నూరుల్ హాసన్ కోరుతున్నాడు. మరి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

తర్వాతి కథనం
Show comments