ధోనీకి ఆ సత్తా వుంది... మహీని మించిన వాడు లేడు.. కపిల్ దేవ్

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (12:56 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి ప్రపంచ కప్‌ను సాధించిపెడతాడని.. మాజీ స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్ పోటీలు మే 30వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 15వ తేదీన ప్రకటించారు. ఈ ప్రపంచ కప్‌లో ధోనీని అదృష్టం వరించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. 
 
సెలెక్టర్లపై విమర్శలు తగవు. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వ్యవహారంలో సెలెక్టర్ వారి పనేంటో వారు చేశారన్నాడు. ప్రపంచ కప్ గెలవడం అంత సులభం కాదన్నాడు. క్రికెటర్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాలి. అదృష్టం వరిస్తే.. టీమిండియా ఈసారి వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని చెప్పాడు.
 
ఇకపోతే.. ధోనీ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అంచనాల మించి రాణిస్తూ ఔరా అనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీపై కపిల్ దేవ్ ప్రశంసలు గుప్పించాడు. అసలు ధోని తరహా క్రికెట్‌ ఆడే క్రికెటర్‌ భారత్‌లో ఎవడూ లేడంటూ అతి పెద్ద కాంప్లిమెంట్‌ ఇచ్చేశాడు. ధోని తరహాలో అటు గేమ్‌పై ఇటు ఫిట్‌నెస్‌పై దృష్టి నిలపాలంటే ఎవరికైనా భారంగానే ఉంటుంది. 
 
ధోని కంటే ఎక్కువగా దేశం కోసం సేవ చేసిన క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారంటే లేరనే చెప్పాలని కపిల్ కామెంట్ చేశాడు. రానున్న వరల్డ్‌కప్‌లో కూడా ధోని కీలక పాత్ర పోషించడం ఖాయమని కపిల్‌దేవ్‌ ఆకాంక్షించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆత్మహత్యకు ముందు బ్యూటీ పార్లర్‌లో త్విషా శర్మ.. ఎవరైనా ఇలా చేస్తారా?

చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి

సూర్యాపేటలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య

టీవీఎల్ అనేది కొత్త రాజకీయ పార్టీనా..? రఘురామ కృష్ణం రాజు ఏమన్నారు?

NEET-UG 2026: నీట్ రద్దు.. అందుబాటులోకి రీఫండ్ సదుపాయం.. చివరి గడువు మే 27, 2026

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: నా కూతురిని ఎత్తుకున్నా నొప్పి పెడుతుంది : రామ్ చరణ్

ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు : యువసామ్రాట్

Nagarjuna's Memories: విక్రమ్ కు 40 ఏళ్ళు - మనం ను మర్చిపోలేని తేదీ : నాగార్జున మెమొరీస్

Vinayak: సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తక్షక సినిమా పోస్టర్ లాంఛ్ చేసిన వి.వి.వినాయక్

Rasheen Rahman: రషీన్ రహమాన్ కొత్త చిత్రం సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments