Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : పాకిస్థాన్ టార్గెట్ 153 రన్స్

Webdunia
బుధవారం, 9 నవంబరు 2022 (15:42 IST)
ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా బుధవారం న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. దీంతో ప్రత్యర్థి పాక్ ముంగిట 153 పరుగుల రన్స్ టార్గెట్ ఉంచింది. 
 
కివీస్ ఆటగాళ్లలో డారెల్ మిచెల్లీ టీ20 మ్యాచ్‌లలో మూడో అర్థ సెంచరీని నమోదు చేశాడు. 32 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 50 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌‌లో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లు లైన్ అండ్ లెగ్త్‌తో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో సింగిల్స్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. 
 
ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు మిచెల్, విలియమ్‌సన్ 68 రన్స్ జోడించారు. నిజానికి ఈ మ్యాచ్‌లో పాక్ బౌలర్లు, ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన ఇచ్చారు. ఫీల్డింగ్‌లోను పాకిస్థాన్ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. కివీస్ బ్యాటర్లు మిచెల్ 53 (నాటౌట్), విలియమ్‌సన్ 46, కాన్వే 21, నీషమ్ 16 (నాటౌట్) చొప్పున పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత 153 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు రిజ్వాన్ 11, బాబర్ అజమ్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments