Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌ క్రికెటర్లకు ఏమైంది? సౌథీ చేసిన ప్రయత్నం కూడా మిగిలినవాళ్లు చేయలేదే..? గంగూలీ

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కివీస్ జట్టుపై సెటైర్లు విసిరాడు. ప్రస్తుతం ఉన్న కివీస్ జట్టులో అంకితభావం, పట్టుదల, పోరాటస్ఫూర్తి లోపించాయని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, బ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (14:16 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కివీస్ జట్టుపై సెటైర్లు విసిరాడు. ప్రస్తుతం ఉన్న కివీస్ జట్టులో అంకితభావం, పట్టుదల, పోరాటస్ఫూర్తి లోపించాయని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, బ్రెండన్ మెకల్లమ్‌లు జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత కివీస్ ఆటగాళ్లు పోరాటాన్ని మరచిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశాడు. భారత పర్యటనలో ఉన్న కివీస్ జట్టు కనీసం పోరాడకుండానే లొంగిపోవడం పట్ల గంగూలీ షాక్ తిన్నాడు. 
 
ఆదివారం జరిగిన ధర్మశాల వన్డేపై గంగూలీ మాట్లాడుతూ.. ఆదివారం నాటి వన్డేనే కాకుండా అంతకుముందు జరిగిన టెస్టు సిరీస్ కూడా చూశానని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే కివీస్ జట్టులో నిర్లక్ష్యం కనబడుతోందని చెప్పాడు. కివీస్ వ్యవహారం చూస్తుంటే తట్టాబుట్టా సర్దేసి భారత్ టూర్‌ను ముగించేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఉన్నట్లున్నారని తెలిపాడు. 
 
ఒకసారి విఫలమైనా మళ్లీ భారత జట్టును ఓడించాలనే కసి వాళ్లలో లోపించింది. మార్టిన్ గుప్టిల్ అవుటైన తరువాత వరుస పెట్టి క్యూకట్టేశారు. ప్రత్యేకంగా కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ అవుటైన విధానం చూడండి. కానీ భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో చూస్తే కివీస్ ఆటగాళ్ల వైఖరి పూర్తిగా మారిపోయినట్లుందన్నారు. కనీసం 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి టిమ్ సౌథీ చూపిన పోరాటం కూడా మిగతా ప్రధాన ఆటగాళ్లు చూపలేకపోయారు. కివీస్ ఆటగాళ్లు ఎందుకిలా ఆడుతున్నారని గంగూలీ వ్యాఖ్యానించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments