Webdunia - Bharat's app for daily news and videos

Install App

4, 6+nb, 6+nb, 6, 1, 6, 6, 6తో కివీస్ బ్యాట్స్‌మెన్ల వరల్డ్ రికార్డ్

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (15:37 IST)
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ విలెమ్ లుడిక్‌కు కివీస్ బ్యాట్స్‌మెన్లు జో కార్టర్, బ్రెట్ హాంప్టన్ చుక్కలు చూపించారు. ఒకే ఓవర్లో 43 పరుగులు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్‌ దేశవాళీ క్రికెట్‌లో ఈ ప్రపంచ రికార్డు నమోదైంది. 
 
ఫోర్డ్‌ ట్రోఫీ వన్డే టోర్నీలో భాగంగా సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో నార్తన్‌ డిస్ట్రిక్ట్‌ ఆటగాళ్లు జొయే కార్టర్‌, బ్రెట్‌ హాంప్టన్‌ ఒకే ఓవర్లో (4, 6+నోబ్‌, 6+నోబ్‌, 6, 1, 6, 6, 6) 43 పరుగులు చేసి ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. గతంలో 2013 ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో అబహని లిమిటెడ్‌ జట్టుపై షేక్‌ జమాల్‌ క్లబ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎల్టన్‌ చిగుంబుర-అల్లావుద్దీన్‌ ఒకే ఓవర్‌లో అత్యధికంగా 39 పరుగులు చేశారు. 
 
మరోవైపు పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. ఫలితంగా ఆ ఘనత సాధించిన మూడో కివీస్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
 
అనంతరం 267 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ట్రెంట్ బౌల్ట్ చుక్కలు చూపించాడు. పాక్ స్కోరు 8 పరుగుల వద్ద ఉన్నప్పుడు వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించాడు. మూడో ఓవర్ రెండో బంతికి ఓపెనర్ ఫకర్ జమాన్ (1)ను బౌల్డ్ చేసిన బౌల్ట్, మూడో బంతికి బాబర్ ఆజం (0)ను పెవిలియన్ పంపాడు. 
 
నాలుగో బంతికి మహమ్మద్ హఫీజ్(0)ను వికెట్ల ముందు దొరికిపోయాడు. చివరికి పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యాట్రిక్ సాధించిన బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments