Webdunia - Bharat's app for daily news and videos

Install App

హార్దిక్ పాండ్యాతో విడాకులు : నటాషా వెల్లడి!!

వరుణ్
శుక్రవారం, 19 జులై 2024 (13:42 IST)
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, తాను విడిపోయినట్టు ఆయన భార్య నటాషా శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. నిజానికి నటాషా తాను విడిపోతున్నట్టు హార్దిక్ పాండ్యా గురువారం రాత్రే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నటాషాతో నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికినట్లు అందులో పేర్కొన్నారు. భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. "పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్టు పాండ్యా వెల్లడించారు. 
 
ఇటీవల తన కుమారుడు అగస్త్యను తీసుకొని నటాషా ముంబై నుంచి సెర్బియాకు వెళ్లిపోయిన విషయం తెల్సిందే. నటాషా ముంబై నుంచి బయలుదేరిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి. ఇదేసమయంలో తాము విడాకులు తీసుకున్నట్లు పాండ్యా ప్రకటించారు.
 
'4 సంవత్సరాల పాటు కలిసి ఉన్న తర్వాత నటాషా, నేను విడిపోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాం. కలిసి ఉండటానికి సాధ్యమైనంతగా ప్రయత్నించాం. ఇద్దరి ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎన్నో మధుర క్షణాల అనంతరం, కుటుంబం ఏర్పడిన తర్వాత విడిపోవడం కఠిన నిర్ణయమే' అని పేర్కొన్నారు.
 
అగస్త్య తమ ఇద్దరితోనూ ఉంటాడని, అతని సంతోషం కోసం మేం తల్లిదండ్రులుగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కష్టమైన సమయంలో తమ గోప్యతకు సహకరించాలని, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. 
 
ఏడేళ్ల క్రితం పాండ్యా-నటాషాకు మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసింది. వీరు ప్రేమలో ఉన్నట్లు 2018లో మీడియాలో జోరుగా వార్తలు వచ్చాయి. 2020లో తాము ప్రేమించుకుంటున్నట్లు పాండ్యా ప్రకటించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. 
 
అలాగే, తన పుట్టినిల్లు అయిన సెర్బియాకు చేరుకున్న నటాషా కూడా శుక్రవారం తమ విడాకుల గురించి అధికారికంగా వెల్లడించారు. అలాగే, తన పేరు నుంచి హార్దిక్ పాండ్యా పేరును తొలగించారు. అలాగే, సోషల్ మీడియాలో హార్దిక్ ఫోటోలను కూడా తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments