Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్‌ను కలిసిన నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు

సెల్వి
సోమవారం, 3 నవంబరు 2025 (11:29 IST)
Nara Lokesh_Sachin
ఆదివారం నవీ ముంబైలో భారతదేశం- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఐటీ అండ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను కలిశారు.
 
"ఈరోజు లెజెండ్‌ను స్వయంగా కలిశాను. అతని వినయం, ఆప్యాయత గురించిన కథలు పూర్తిగా నిజం వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం ఒక అదృష్టం. క్రికెట్ దేవుడిగా, మరింత మెరుగైన మానవుడిగా తరాలను ప్రేరేపించినందుకు సచిన్, ధన్యవాదాలు.." ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. 
Nara Lokesh_Sachin
 
టీమిండియాను ఉత్సాహపరిచేందుకు, మహిళా క్రికెట్ పెరుగుదలను జరుపుకోవడానికి తాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నానని నారా లోకేష్ ఒక ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు.
 
అలాగే భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య నవీ ముంబై వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో నారా లోకేష్ ఫ్యామిలీ సందడి చేసింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌కు నారా లోకేష్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. 
Nara Lokesh_Sachin
 
సతీమణి నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌లతో పాటుగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని సందడి చేశారు. ఈ సందర్భంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను నారా లోకేష్ ఫ్యామిలీ కలిసింది. సచిన్‌తో కలిసి ఫోటోలు దిగారు. అలాగే ఐసీసీ ఛైర్మన్ జైషాను కలిశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీ సభకు హాజరైతే విద్యార్థులకు అంతర్గత మార్కులు..?

థార్ వాహనం నడిపేవారిని అస్సలు వదిలిపెట్టం : హర్యానా డీజీపీ

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం - ఓవర్ డోస్‌తో యువకుడి మృతి

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

తర్వాతి కథనం
Show comments