శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ఈ దురదృష్టకర ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏకాదశి రోజున ఇలాంటి ఘోరం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే తాను జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో ఫోన్‌లో మాట్లాడినట్లు లోకేశ్ తెలిపారు. బాధితులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. 
 
									
										
								
																	
	 
	ఇంకా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న నారా లోకేష్.. కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రైలింగ్ కూలి తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేంద్రమంత్రి, హోంమంత్రి అనిత, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషజిల్లా ఎస్పీ గారితో కలిసి మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. శ్రీకాకుళంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారికి 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను నారా లోకేష్ ప్రకటించారు.