ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : శ్రీలంకకు షాకిచ్చిన పసికూన నమీబియా

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (16:07 IST)
ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం నుంచి ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా, తొలి రౌండ్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా ఆదివారం శ్రీలంక జట్టు క్రికెట్ పసికూన నమీబియాతో తలపడింది. అయితే, లంకేయులకు నమీబియా క్రికెటర్లు తేరుకోలేని షాకిచ్చారు. 55 పరుగుల తేడాతో లంక జట్టును చిత్తు చేశారు.
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన నమీబియా జట్టు 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేక నమీబియా జట్టు చతికిలపడింది. 108 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. శ్రీలంక ఆటగాళ్లలో ఏ ఒక్కరు కూడా 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించలేకపోయారంటే ఎంత పేలవంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. 
 
ఇదిలావుంటే, ఆదివారం నుంచి ప్రారంభమైన తొలి రౌండ్ పోటీల్లో మొతంత 8 జట్లు పాల్గొంటాయి. జీలాంగ్‌, హోబర్ట్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్‌లు. 
 
గ్రూప్‌-ఎలో నమీబియా, నెదర్లాండ్స్‌, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్‌-బిలో స్కాట్లాండ్‌, ఐర్లాండ్‌, వెస్టిండీస్‌, జింబాబ్వే పోటీపడనున్నాయి. 
 
గ్రూప్‌లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్‌-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్‌-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్‌ జరుగుతుంది.
 
గతేడాది టోర్నీ మాదిరే టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను ఎదుర్కోబోతోంది. ఈనెల 23న ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 90 వేలకు పైగా ప్రేక్షకులు ఈ పోరును ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments