Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ కుమార్తె ఫోటో వైరల్.. హిట్ మ్యాన్ సోషల్ మీడియా సూపర్

Webdunia
బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (15:27 IST)
Rohit sharma
రోహిత్ కుమార్తె ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హిట్‌మ్యాన్‌.. భార్య రితిక, కుమార్తె సమైరాలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో కూతురు సమైరాతో కలిసి రోహిత్ దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
రోహిత్‌ సతీమణి రితిక మంగళవారం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రితిక తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేసిన ఆ వీడియోలో రోహిత్‌, సమైరా ఇద్దరూ ఫోన్‌లో నిమగ్నమయ్యారు. రోహిత్‌ చిన్నారి సమైరాకు ఏదో చూపిస్తున్నాడు. సమైరా ఎంతో ఆసక్తిగా రోహిత్ చూపిస్తున్న అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ వీడియోకి రితిక అనుమతి ఇచ్చిందని రాసుకొచ్చారు. 
Rohit sharma
 
ఇకపోతే.. రితిక పోస్ట్ చేసిన వీడియోపై ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ సరదాగా ఓ ట్వీట్‌ చేసింది. 'రోహిత్‌ కొత్త సోషల్‌ మీడియా మేనేజర్‌ ఎంత క్యూట్‌గా ఉంది. ఆమెకు పదికి ఎన్ని పాయింట్లు ఇస్తారు' అని ట్వీట్ చేసింది. ముంబై ట్వీట్‌పై నెటిజన్లు తమదైన స్టయిల్లో రిప్లై ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

తర్వాతి కథనం
Show comments