Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపద్బాంధవుడు ధోనీ...(video)

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:32 IST)
జార్ఖండ్ డైనమెట్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ ఇపుడు భారత క్రికెట్ జట్టుకు ఆపద్బాంధవుడుగా మారాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు తానున్నానంటూ పలు సందర్భాల్లో నిరూపించాడు. ముఖ్యంగా, కీలకమైన మ్యాచ్‌లలో భారత జట్టు ఘోరంగా విఫలమై కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చి... అద్భుతమైన పోరాట పటిమతో బ్యాటింగ్ చేస్తూ పరుగులు వర్షం కురిపిస్తాడు. ఫలితంగా ఎన్నో కీలకమైన మ్యాచ్‌లలో టీమిండియా విజయభేరీ మోగించింది. 
 
జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీ చేసిన పరుగులను ఓసారి పరిశీలిస్తే, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 82 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ.. 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడమేకాకుండా జట్టు స్కోరును 188కు చేర్చాడు.
 
అలాగే, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జట్టు స్కోరు 152/6గా ఉండగా, ఈ మ్యాచ్‌లో ధోనీ పుణ్యమాని భారత జట్టు స్కోరు 203/9 చేసింది. ఈ మ్యాచ్‌లో ధోనీ 45 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో టీమిండియా 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పరువు కోల్పోయే పరిస్థితిలో ఉండగా, ధోనీ ఏకంగా సెంచరీ కొట్టి (113 నాటౌట్) జట్టు స్కోరును 227/8కు చేర్చాడు. 
 
అదేవిధంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 76/4గా ఉన్న సమయంలో ధోనీ క్రీజ్‌లోకి వచ్చి 139 (నాటౌట్) పరుగులు చేసి... జట్టు స్కోరు 303కు పెంచాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 92/4 స్కోరుతో ఉండగా, ధోనీ (85 నాటౌట్) పుణ్యమాని భారత్ 288/4 పరుగులు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 104/5గా ఉన్నపుడు ధోనీ 92 (నాటౌట్) పరుగులు చేసి... జట్టు స్కోరును 247/9గా చేర్చాడు. 
 
ఇకపోతే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ స్కోరు 25/3గా ఉన్నపుడు క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ... 134 పరుగులు చేసి 358/6 పరుగుల భారీ స్కోరు చేసేలా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 29/7గా ఉన్నపుడు క్రీజ్‌లోకి వచ్చి 65 పరుగులతో రాణించి జట్టు స్కోరు 112/10గా చేర్చి భారత పరువును నిలబెట్టాడు. 
 
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కూడా 64/4గా ఉన్నపుడు ధోనీ 79 పరుగులు చేయడంతో 281/7 పరుగులకు ర్చాడు. చివరగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్లకు 131 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీ 45 పరుగులతో రాణించి జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా స్కోరు 232/7గా చేరాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments