Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామిల్టన్‌లో చాప చుట్టేసిన టీమిండియా.. అతి తక్కువ స్కోర్లు చిట్టా ఇదే...

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (13:41 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం హామిల్టన్ వేదికగా జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో అతి తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. కివీస్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ ధాటికి భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా 20 పరుగులకు మించి చేయలేక పోయారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒక్కడే అత్యధికంగా 18 పరుగులు చేశాడు. అయితే, భారత జట్టు న్యూజిలాండ్‌పై సాధించిన ఈ 92 పరుగులు వన్డేల్లో ఏడో అత్యల్ప స్కోరు కావడం విశేషం. అంతకుముందు భారత్ చేసిన తక్కువ స్కోర్ల వివరాలను పరిశీలిస్తే, 
 
* 2000 సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 54 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో లంక జట్టు 300 పైచిలుకు పరుగులు చేస్తే భారత్ అతి తక్కువ స్కోరుకు ఆలౌట్ అయి అప్రతిష్టపాలైంది.
 
* 1981లో జరిగిన ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా కేవలం 63 పరుగులకు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో గ్రెగ్ చాపెల్ ఐదు వికెట్లు తీశాడు. గుండప్ప విశ్వనాథ్ (23), రోజర్ బిన్నీ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు అందుకున్నారు. 
 
* 1986లో కాన్పూర్‌లో జరిగిన వన్డేలో 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 78 పరుగులకు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో అర్జున రణతుంగా నాలుగు వికెట్లు తీసి లంకకు విజయం సాధించి పెట్టాడు. 
 
* 1978లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 79 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో 80 పరుగుల టార్గెట్‌ను పాకిస్థాన్ 17 ఓవర్లలో ఛేదించింది. 
 
* 2010లో జరిగిన మ్యాచ్‌లో ఇండియా కేవలం 88 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటికే కివీస్‌పై భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరుగా ఉంది. 
 
* 2006లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 91 పరుగులకు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో సఫారీలు 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 
* 2019 జనవరి 31వ తేదీన హామిల్టన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 92 పరుగులకు ఆలౌట్ కాగా, కివీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Adilabad: ఆదిలాబాద్ గ్రామీణ పౌర సంస్థలకు ఎన్నికలు.. ఎప్పుడంటే?

Floods: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 50 ఏళ్ల తర్వాత తెలంగాణలో భారీ వర్షాలు- భారీ నష్టం

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

తర్వాతి కథనం
Show comments