Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ జట్టులో ధోనీకి చోటు కష్టమే.. చెప్పిందెవరు?

Webdunia
శనివారం, 28 మార్చి 2020 (13:11 IST)
భారత జట్టులో ధోని తిరిగి చోటు దక్కించుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై అతని చిన్ననాటి కోచ్‌ కేశవ్‌ రంజాన్‌ బెనర్జీ కూడా దాదాపు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోనీ టీమిండియాలో చోటు దక్కించుకోవడం కష్టమే కానీ  చివరగా ఒక్క చాన్స్‌ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదన్నాడు. 
 
ఐపీఎల్‌తో తిరిగి సత్తా చాటుకుని జట్టులోకి రావాలని చూసిన ధోనికి నిరాశే ఎదురైందని గుర్తు చేశాడు. ఐపీఎల్‌ కోసం ముందుగానే ప్రాక్టీస్‌ మొదలు పెట్టేసినా ఆ లీగ్‌ వాయిదా పడటంతో ధోని ఆశలు నిరాశగా మారిపోయే అవకాశం వుందని చెప్పుకొచ్చాడు. 
 
కరోనా కారణంగా ఐపీఎల్ జరుగుతుందనే విషయంపై కూడా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌తో భారత జట్టులో తిరిగి రావాలని ధోని చూశాడని, ఆ టోర్నీ జరుగుతుందా లేదా అనేది సందిగ్ధంలో పడిన తరుణంలో ధోనీకి జాతీయ జట్టులో చోటు కష్టమేనని అంటున్నాడు. కాకపోతే భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)..ధోనికి చివరగా ఒక అవకాశం ఇచ్చి చూస్తుందన్నాడు. అది కూడా టీ20 వరల్డ్‌కప్‌లో ధోనికి చివరి అవకాశం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments