Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌-9లో ధోనీ-అశ్విన్‌లకు విభేదాలా...? అజిత్ అగార్కర్ ఏమన్నాడు?

Webdunia
మంగళవారం, 10 మే 2016 (17:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కెప్టెన్ ధోనీ, బౌలర్ అశ్విన్‌ల మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని ఐపీఎల్ మ్యాచులలో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌కు బౌలింగ్‌కు అవకాశం ఇవ్వట్లేదని వస్తున్న పుకార్లపై, ధోనీ- అశ్విన్ ఇంతవరకు నోరు తెరవక పోయినా.. దీనిపై మాజీ పేసర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. 
 
అశ్విన్ పైన ధోనీ నమ్మకం కోల్పోలేదనేందుకు ఇప్పటికే ముగిసిన మ్యాచ్ పరిస్థితులే కారణమన్నాడు. ముంబై వాంఖేడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో పూణే ఆడిన మ్యాచ్‌లో వాంఖేడే పిచ్ సీమర్లకు అనుకూలిస్తుందని, అందుకే ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. చెన్నైలో ఐపీఎల్ మ్యాచులు ఆడినప్పుడు అక్కడి వికెట్ స్పిన్‌కు సహకరిస్తుందని, కాబట్టి అశ్విన్‌కు ఎక్కువ అవకాశమిచ్చాడని చెప్పాడు.  
 
అయితే అశ్విన్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరిస్థితి అనుకూలంగా బౌలింగ్ చేయగలడని కితాబిచ్చాడు. గతంలో అశ్విన్‌‌పైన అంత విశ్వాసం ఉంచిన ధోనీ.. ప్రస్తుతం ఇలా వ్యవహరించడం ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు.. క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

తర్వాతి కథనం
Show comments