మునుపటి స్థాయిలో ఫిట్‌గా లేనంటున్న జార్ఖండ్ డైనమెట్!!

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (15:41 IST)
తన ఫిట్నెస్‌పై భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో ఉన్నట్టుగా ఫిట్నెస్‌గా లేనని చెప్పారు. అయితే, ఫిట్‌గా ఉండేందుకు నిర్దిష్టమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఈ యేడాది జరుగనున్న ఐపీఎల్ 2025లో ధోనీ ఆడనున్నారు. ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ రూ.4 కోట్ల ధరకు అదనపు ఆటగాడిగా ఎంపిక కొనుగోలు చేసింది. ఈ యేడాది మార్చిలో మెగా టోర్నీ ఆరంభంకానున్న నేపథ్యంలో తన ఫిట్నెస్పై కీలక అప్డేట్ ఇచ్చాడు.
 
తాను మునుపటి స్థాయిలో ఫిట్‌గా లేనని, అయితే స్పోర్ట్స్ ఆడడానికి అవసరమైన ఫిట్నెస్‌లో మాత్రం ఉన్నట్టు వ్యాఖ్యానించాడు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఫిట్‌‍గా ఉండేందుకు తాను చేయాల్సిన నిర్దిష్టమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించాడు. 
 
"మేమేమీ ఫాస్ట్ బౌలర్లం కాదు. కాబట్టి, అంత తీవ్రంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు" అని ధోనీ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు టైర్ల తయారీ కంపెనీ 'యూరోగ్రిప్ టైర్స్' నిర్వహించిన 'ట్రెడ్ టాక్స్' ఎపిసోడ్‌లో ధోనీ మాట్లాడాడు.
 
తినే ఆహారం, జిమ్‌కు వెళ్లడం ఫిట్‌గా ఉండడానికి దోహదపడతాయని ధోనీ పేర్కొన్నాడు. ఏదో ఒక ఆట ఆడుతుంటే ఫిట్‌గా ఉంటామని, అందుకే సమయం దొరికినప్పుడల్లా విభిన్నమైన క్రీడలను ఆడాలనుకుంటున్నట్టు చెప్పాడు. కాగా, ఎంఎస్ ధోనీ వయసు 43 సంవత్సరాలు దాటిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments