Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్ క్రికెటర్లకు పీసీబీ హెచ్చరిక.. ఫిట్నెస్ లేకుంటే అంతే సంగతులు..

pakistan team

ఠాగూర్

, సోమవారం, 30 సెప్టెంబరు 2024 (13:19 IST)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 6-7 మంది సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఫిట్నెస్ ప్రమాణాలు పాటించని వారిని జట్టు నుంచి తప్పిస్తామని హెచ్చరించింది. ఫిట్నెస్‌ను మెరుగుపరచుకోవాలని, లేనిపక్షంలో ఆయా ఆటగాళ్లు కాంట్రాక్టులను కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
 
ఈ నెల ప్రారంభంలో జరిగిన ఫిట్నెస్ టెస్ట్లలో కొంతమంది ఆటగాళ్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ జట్టు ఫిట్నెస్ ట్రైనర్, ఫిజియోథెరపిస్ట్ సోమవారం లాహోర్ లో మరో రౌండ్ ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే పీసీబీ తమ ఆటగాళ్లను హెచ్చరించింది.
 
"కేంద్ర, దేశీయ కాంట్రాక్టులను కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫిట్నెస్ విషయమై ఎటువంటి రాజీ ఉండదు. వారు జట్టు ఫిట్నెస్ నిపుణులు నిర్దేశించిన బెంచ్ మార్క్ కు అనుగుణంగా ఫిట్నెస్ ప్రమాణాలను కలిగి ఉండాలి" అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరు విదేశీ ప్రధాన కోచ్లు జాసన్ గిల్లిస్పీ, గ్యారీ కిర్టన్లు ఫిట్నెస్ స్థాయులకు సంబంధించినంతవరకు ఏ ఆటగాడికి ఎలాంటి ప్రయోజనం ఇవ్వకూడదని పీసీబీ ఛైర్మన్ కి చెప్పినట్లు అధికారి పేర్కొన్నారు.
 
ఇక ఈ ఫిట్నెస్ పరీక్షలు అనేవి ప్లేయర్ల స్టామినా, కండరాల బలం, , ఇతర కీలకమైన అంశాలను అంచనా వేయడానికి ఉద్దేశించనవి. ఈ ఏడాది ప్రారంభంలో ఫిట్నెస్ పరీక్షల్లో బెంచ్ మార్క్్న అందుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లకు వారి ఫిట్నెస్ ను మెరుగుపరచుకోవడానికి రెండు నెలల సమయం ఇచ్చామని, సోమవారం జరిగే పరీక్షలు వారికి కీలకమని అధికారి తెలిపారు. ఇందులో విఫలమైతే ఆటగాళ్లకు ఉద్వాసన తప్పదని తేల్చిచెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3వ ఏడాది ప్రపంచ రికార్డ్‌ సెట్ చేసిన పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ 2024