Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాజీ క్రికెటర్ల నివాసాల్లో ఈడీ, ఐటీ కలకలం

Advertiesment
ahmadabad cricket statidum
, గురువారం, 23 నవంబరు 2023 (10:05 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఈడీ, ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు రాజకీయ నాయకులను టార్గెట్ చేశాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మాజీ క్రికెటర్ల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయాబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జి. వినోద్ నివాసాల్లో ఈరోజు ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో ఈ ముగ్గురూ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.
 
ఏసీబీ నమోదు చేసిన మూడు కేసుల ఆధారంగా ఈడీ ఈ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శివలాల్ యాదవ్, అర్షద్ అయ్యబ్, వినోద్‌ల బ్యాంకు ఖాతాలు, గత లావాదేవీలు, విలువైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 
 
ఈసారి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గడ్డం వినోద్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
అతని సోదరుడు గడ్డం వివేక్‌కు సంబంధించి చెన్నూరులోని ఆయన ఇల్లు, కార్యాలయంలో, హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని ఆయన నివాసంలో మంగళవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
 
కాంగ్రెస్ అభ్యర్థులపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి దాడులు చేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నేతలు జానా రెడ్డి, పొంగులేటి కె లక్ష్మా రెడ్డి, పారిజాత నరసింహారెడ్డిలపై ఐటీ సోదాలు జరిగాయి.
 
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్.. కిషన్ రెడ్డి ఫైర్