Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అర్జున అవార్డు' కోసం మహ్మద్ షమీ పేరు

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2023 (09:15 IST)
ఇటీవల స్వదేశంలో ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భారత బౌలర్ మహ్మద్ షమీ అద్భుతంగా రాణించారు. భారత బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. అన్ని లీగ్ మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్లను తన బౌలింగ్‌తో వణికించాడు. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం భారత బౌలర్లు రాణించలేకపోవడంతో భారత్ చివరి గట్టుపై బోల్తాపడి, ప్రపంచ కప్‍‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డు కోసం మహ్మద్ షమీ పేరును సిఫార్సు చేశారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ అతడి పేరును ప్రతిపాదించింది. 
 
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు నామినీల జాబితాలో తొలుత షమీకి స్థానం దక్కకపోవడంతో బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వరల్డ్ కప్ షమీ ప్రదర్శన దృష్ట్యా అతడిని నామినీగా పరిగణించాలని క్రీడా శాఖకు బీసీసీఐ ప్రత్యేక విజ్ఞప్తి చేయడంతో షమీ అర్జున అవార్డు నామినీగా ఎంపికయ్యాడని తెలుస్తోంది. దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డు అన్న విషయం తెలిసిందే.
 
వరల్డ్ కప్ షమీ అసామాన్య ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. టోర్నీలో కేవలం 7 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి అత్యధికంగా వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో షమీ కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం యావత్ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. టోర్నీలో తొలి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో లేని షమీ ఆ తర్వాత తన అద్భుత ప్రదర్శనతో యావత్ టోర్నీలో స్టార్‌గా నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

72మందితో 92 సార్లు భార్యకు తెలియకుండానే రేప్.. కోర్టు సంచలనం

బెజవాడ దుర్గమ్మకు రూ.18 లక్షలతో మంగళసూత్రం.. సామాన్య భక్తుడి కానుక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

తర్వాతి కథనం
Show comments