Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెచ్‌సీఏలో ముదిరిన వివాదం.. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (13:41 IST)
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చరచ్చగా మారాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై వేటు పడింది. ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేసింది. ఇక అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందన ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది. 
 
అజారుద్దీన్ టీమిండియా కెప్టెన్‌గా పని చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 11న హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది.
 
అయితే హెచ్‌సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించడంలేదని విమర్శలు చేశారు. 
 
ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని చెప్పారు. అజార్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంపై కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేసి, ఆ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని కోరతామని యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. అటు ఎమ్మెల్సీ కవిత కూడా హెచ్‌సీఏలో ‌జరుగుతున్న అవకతవకలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపడతామని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments