Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ రికార్డ్‌ను సృష్టించిన మిథాలీ రాజ్.. గప్తిల్‌ను కూడా వెనక్కి నెట్టేసింది..

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (17:10 IST)
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భారత జట్టు పరుగుల వరద కురిపిస్తోంది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాపై హర్మన్ అదిరిపోయే సెంచరీ సాధించగా.. ఐర్లాండ్‌ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు విజయం అందించింది. 
 
ఈ మ్యాచ్‌లో 51 పరుగులు సాధించిన మిథాలీ తన కెరీర్‌లో 17వ అర్థ శతకాన్ని పూర్తి చేసుకుంది. ఈ స్కోర్‌‌తో మిథాలీ రాజ్ అంతర్జాతీయ మహిళల క్రికెట్ విభాగంలోనే కాకుండా పురుషుల విభాగంలోనూ దిగ్గజ క్రికెటర్లను వెనక్కి నెట్టింది. 
 
పురుషుల అంతర్జాతీయ ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (2207)తో అగ్రస్థానంలో వుండగా, అతడి తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ వున్నాడు. కానీ మిథాలీ ఇదివరకే పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరి రికార్డులను బ్రేక్ చేస్తూ.. టీ-20ల్లో 2232 పరుగులతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 
 
తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించింది. ట్వంట-20 క్రికెట్ చరిత్రలో కివీస్ బ్యాట్స్‌మెన్ మార్తిన్ గప్తిల్ 2271 పరుగులతో వరల్డ్ నెంబర్ వన్‌గా వుంటే.. మిథాలీ 37.43 సగటుతో 2283 పరుగులతో గప్తిల్‌ని కూడా వెనక్కి నెట్టేసింది. 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments