ఐపీఎల్ 2024 : నేడు ముంబై - హైదరాబాద్ జట్ల కీలక మ్యాచ్!

ఠాగూర్
సోమవారం, 6 మే 2024 (15:51 IST)
గత కొన్ని రోజులుగా స్వదేశంలో ఐపీఎల్ 2024 పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై - హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ సోమవారం జరగనుంది. ముంబైకి ఈ మ్యాచ్‌ ఫలితంతో ప్రయోజనం లేదు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు 277/3 ముంబైపై హైదరాబాద్‌ చేసినదే. సన్‌రైజర్స్ త్రయం అభిషేక్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ దూకుడుకు ముంబై బౌలర్లు బలైన సంగతి తెలిసిందే. 
 
ముంబై - హైదరాబాద్‌ జట్లు 22 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ముంబై 12, సన్‌రైజర్స్ 10 మ్యాచుల్లో గెలిచాయి. వాంఖడేలో మాత్రం ముంబైదే ఆధిపత్యం.  వాంఖడే పిచ్‌ బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించదు. అయితే, గత మ్యాచ్‌ ఫలితాన్ని చూస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. 170 పరుగుల టార్గెట్‌ను కూడా ముంబై ఛేదించలేకపోయింది. 
 
అత్యధిక పరుగులు చేసిన జాబితాలో హైదరాబాద్‌ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (396) తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్ (337) 15వ స్థానంలో ఉన్నాడు. ముంబై నుంచి ఒక్క బ్యాటర్‌ కూడా టాప్‌ -15లో లేకపోవడం గమనార్హం. పర్పుల్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్న జస్‌ప్రీత్‌ బుమ్రా (17 వికెట్లు) నుంచి ముంబై మరోసారి అద్భుత బౌలింగ్‌ ఆశిస్తోంది. ఈ పర్పుల్ రేసులో హైదరాబాద్ పేసర్ నటరాజన్ (15) నాలుగో స్థానంలో ఉన్నాడు. 
 
ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై తన స్టార్‌ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు మొగ్గు చూపుతుందనే వార్తలు వస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబతున్నారు. ప్రస్తుతం ముంబై 11 మ్యాచుల్లో మూడు విజయాలను మాత్రమే నమోదు చేసింది. హైదరాబాద్‌ 10 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించింది. 
 
ముంబై (తుది జట్టు అంచనా): ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య (కెప్టెన్), నమన్ ధిర్, టిమ్‌ డేవిడ్, గెరాల్డ్ కోయిట్జీ, పీయూశ్‌ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా
 
హైదరాబాద్‌ (తుది జట్టు అంచనా): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అన్‌మోల్‌ ప్రీత్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), నితీశ్‌ రెడ్డి, అబ్దుల్ సమద్, షహబాజ్‌ అహ్మద్, మార్కో యన్‌సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

తర్వాతి కథనం
Show comments