Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2025 : లక్నోపై అలవోకగా గెలిచిన పంజాబ్

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (23:20 IST)
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు అలవోకగా గెలిచింది. లక్నో జట్టు సొంత గడ్డపై చిత్తు చేస్తూ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది. 
 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు, పంజాబ్ బౌలర్లు ధాటికి తట్టుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (44), ఆయుష్ బదోని (41) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు చేశారు. సమద్ 27 పరుగులతో మెరుపులు మెరిపించాడు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి లక్నో బ్యాటింగ్‌ లైనప్‌కు దెబ్బతీశాడు. 
 
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 34 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లతో 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 52, నేహాల్ వధేరా 42 పరుగులతో రాణించడంతో పంజాబ్ 16.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 
 
ఈ విజయం పంజాబ్‌ కింగ్స్‌‍కు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. వరుసగా రెండో విజయం సాధించడంతో పంజాబ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. మరోవైపు, లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఓటమితో నిరాశలో కూరుకుపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments