Webdunia - Bharat's app for daily news and videos

Install App

థర్డ్ టెస్ట్ మ్యాచ్ : విజయం దిశగా సౌతాఫ్రికా

జోహన్స్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లోభారత్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సఫారీల ముంగిట 241 పరుగుల విజయ లక్ష్

Webdunia
శనివారం, 27 జనవరి 2018 (17:58 IST)
జోహన్స్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లోభారత్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సఫారీల ముంగిట 241 పరుగుల విజయ లక్ష్యంగా నిర్ధేసించింది. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో భోజనవిరామ సమయానికి ఆమ్లా, ఎల్గర్‌లు కలిసి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు మూడో రోజే ఓపెనర్ మార్క్‌రం వికెట్ కోల్పోయింది. 
 
నాలుగో రోజు 17/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆమ్లా, ఎల్గర్‌ కలిసి రెండో వికెట్‌కి 64 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. భారత పేస్‌ని ధీటుగా, వికెట్లు కాపాడుకుంటూ.. పరుగులు రాబట్టేందుకు వీరిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. 
 
మరోవైపు గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో సఫారీల వికెట్‌లు పడగొట్టేందుకు భారత బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. దీంతో భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా 1 వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. భారత్‌పై విజయం సాధించేందుకు దక్షిణాఫ్రికా ఇంకా 172 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో ఆమ్లా(27), ఎల్గర్(29) ఉన్నారు. 
 
241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. స్కోరు 17 ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 42గా ఉంది. మార్క్‌రమ్ 4 పరుగులకే షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్ 17, హషిమ్ ఆమ్లా 12 పరుగులతో ఉన్నారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 199 పరుగులు చేయాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

తర్వాతి కథనం
Show comments